![]() |
![]() |
.webp)
సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి కొరియోగ్రాఫర్లు యశ్వంత్ - భూషణ్ , భాను - విజయ్ వచ్చారు. ఐతే ఈ షోలో సుమ ఎలాంటి గేమ్స్ ఆడించలేదు..అన్ని పంచ్ డైలాగ్స్ వేసింది, వేయించింది. ఈ షోలో "జానీ జానీ ఎస్ పాప" అనే ఇంగ్లీష్ రైమ్ ని డిస్ ప్లే చేసి పాడింది సుమ. ఐతే విజయ్ మాష్టర్ ఐతే "పాపను చూపియ్యండి" అన్నాడు సీరియస్ గా.. దానికి రిప్లైగ భాను మాష్టర్ "మాష్టర్ పాప కాదు పప్పా" అని సరిచేసాడు. అసలు షోస్ లో ఈ బూతులేంటో అర్ధం కావడమే లేదు. సరే ఇక తర్వాత బోర్డు మీద చిన్న చిన్న గుణకారాలు వేసి అందరినీ అడిగింది సుమ. వాళ్ళు కూడా చెప్పారు.
ఇక ఫైనల్ లో యష్ మాష్టర్ వాళ్ళ అమ్మతో కలిసి ఉన్న ఫోటో చూపించి విషయం అడిగింది. "అమ్మ నన్ను చాలా ఎంకరేజ్ చేసేది..ఆమె లేకపోతె ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేవాణ్ణే కాదు. నేను ఎక్కడికి వెళ్లిన కూడా మా అమ్మ నాతో వచ్చేది " అని చెప్పాడు. ఇక ఫైనల్ గా విజయ్ మాష్టర్ అల్లు అర్జున్ తో ఉన్న రిలేషన్ చెప్పాడు. పుష్ప టైటిల్ సాంగ్ లోని షూ స్టెప్ కంపోజ్ చేసింది మాత్రం విజయ్ పోలాకి మాస్టర్. ఆ స్టెప్ బాగా ఫేమస్ అయ్యింది. "బన్నీ గారు నెక్స్ట్ లెవెల్ లో ఉంటారు. ఆయన హార్డ్ వర్క్ కి సెల్యూట్ చేయాలి" అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. ఇలా ఈ వారం ఈ షో అలరించబోతోంది.
![]() |
![]() |